- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది : టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు.

దిశ, సంగారెడ్డి అర్బన్ : కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం సంగారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన విద్యావారోత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కళాశాలలో ఆన్‌లైన్ తరగతుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన మానిటర్లను నిర్మలా జగ్గారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ కళాశాల విద్యార్థినులు అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. భవిష్యత్తుపై స్పష్టమైన దృష్టితో ఇప్పటి నుంచే కష్టపడి చదవాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, కళాశాల ప్రిన్సిపాల్ సునీత, అధ్యాపకులు శ్రీనివాస్, కళాశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.






