- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్ డెస్క్ : ఆయన సాక్షాత్తూ ఓ జిల్లాకు కలెక్టర్. అయినప్పటికీ ఆ భేషజాలు వదిలి కాసేపు కూలీగా మారి రైతుకూలీలతో కలిసి పని చేశారు. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్(Medak Collector Rahul Raj) శుక్రవారం పాతూర్ లోని ఓ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ధాన్యాన్ని జల్లెడ పడుతున్న రైతులతో మాట్లాడిన అనంతరం కూలీలతో కలిసి కలెక్టర్ ధాన్యాన్ని జల్లెడ పట్టారు. స్వయంగా కలెక్టర్ తట్ట నెత్తికి ఎత్తుకోగా.. అధికారులు కూడా కొద్దిసేపు కలెక్టర్ తో కలిసి ధాన్యం పనులు చేశారు. జిల్లాలో 480 ధాన్యం కొనుగోలు కేంద్రాలను, ధాన్యం క్లీనర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు.
Next Story






