తండా గరం.. కూల్ కూల్

by Bhanu |

జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికలు అభ్యర్థులకు దడ పుట్టిస్తుండగా చలి మాత్రం కూల్‌గా కూల్ చేస్తోంది

తండా గరం.. కూల్ కూల్
X

దిశ, ఝరాసంగం: జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికలు అభ్యర్థులకు దడ పుట్టిస్తుండగా చలి మాత్రం కూల్‌గా కూల్ చేస్తోంది. గత మూడు రోజులుగా జిల్లాలో 6.6 కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా గురువారం మరింత తగ్గింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 6.5 కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రతతో ప్రజలు, ఓటర్లు, విద్యార్థులు, కూలీలు, గ్రామపంచాయతీ ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులు, ఎన్నికల విధులకు వెళ్లే ఉద్యోగులు సైతం తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఒకపక్క ఓటర్లు చలితో వణికిపోతుంటే మరోపక్క ఓటర్లను మద్యం, మాంసం, వంటకాలతో ‘గరం’ చేసే పనిలో ఉన్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగుస్తుంది. దీంతో గ్రామాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. జహీరాబాద్ డివిజన్‌లోని ఝరాసంగం, న్యాల్‌కల్ 6.5, మొగుడంపల్లి 6.6, కోహిర్ 7.2, జహీరాబాద్ 7.6 తదితర ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

Next Story