- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డివైడర్ పైకి దూసుకొచ్చిన ఆటో..!
ప్రమాద వశాత్తూ ఫ్యాసింజర్ ఆటో రోడ్డు మధ్యలో ఉన్నటువంటి డివైడర్ పై ఏర్పాటు చేసిన ప్రమాద సూచిక బోర్డును ఎక్కిన సంఘటన చేర్యాల మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది.

X
దిశ, చేర్యాల : ప్రమాద వశాత్తూ ఫ్యాసింజర్ ఆటో రోడ్డు మధ్యలో ఉన్నటువంటి డివైడర్ పై ఏర్పాటు చేసిన ప్రమాద సూచిక బోర్డును ఎక్కిన సంఘటన చేర్యాల మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కడవేరుగు గ్రామానికి చెందిన అంజయ్య తన ఆటోలో వస్తున్న క్రమంలో చేర్యాల కొత్త బస్టాండ్ వద్ద ఆటో అదుపు తప్పి డివైడర్ మధ్యలో ఉన్న ప్రమాద సూచిక బోర్డును ఢీ కొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాద సమయంలో ఆటోలో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన స్థలానికి చేరుకున్న చేర్యాల సీఐ రమేష్, ఎస్సై నవీన్ స్థానికుల సహాయంతో ఆటోను డివైడర్ మధ్యలో నుంచి పక్కకు తొలగించారు.
Next Story






