ఉద్యోగుల సమస్యల పై అసెంబ్లీ ప్రశ్నిస్తా : మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు

by Ratna Kumari |

మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రతిష్టను, ఆదాయాన్ని పెంచితే, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం దివాలా తీసిందని దిక్కు మాలిన ప్రచారం చేసి అద్భుతమైన రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు.

ఉద్యోగుల సమస్యల పై అసెంబ్లీ ప్రశ్నిస్తా :   మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రతిష్టను, ఆదాయాన్ని పెంచితే, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం దివాలా తీసిందని దిక్కు మాలిన ప్రచారం చేసి అద్భుతమైన రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేటలోని టీఎన్జీవో భవన్‌లో నిర్వహించిన ఉత్తమ ఉద్యోగుల సన్మాన కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉద్యోగులను సత్కరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఉద్యోగులు పీఆర్ సీ కోసం అడిగితే ఏసీబీ దాడులు.. ఫీజు రియంబర్స్ మెంట్ కోసం కాలేజీ యాజమాన్యాలు ప్రశ్నిస్తే విజిలెన్స్ దాడులు.. ప్రతి పక్షాలు ప్రశ్నిస్తే సీట్ నోటీసులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యం పై దాడి చేస్తుందని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో ఒకసారి 42 శాతం, మరోసారి 30 శాతం చొప్పున మొత్తం 72 శాతం పీఆర్సీ ఇచ్చి ఉద్యోగులను గౌరవించుకున్నట్లు గుర్తు చేశారు. రెండు సంవత్సరాల రెండు నెలల్లో 95 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులకు టెండర్లు పిలిచి అవార్డు చేయడంతో పాటుగా, సుమారు రూ.30 వేల కోట్ల రూపాయలు కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన సీఎ రేవంత్ రెడ్డి కి ఉద్యోగుల బకాయిలు చెల్లించడానికి మనసు రావడం లేదన్నారు. మూసీ సుందరీకరణకు లక్ష కోట్లు, ఫ్యూచర్ సిటీకి లక్ష కోట్లు, హ్యామ్ రోడ్ల కోసం 15 వేల కోట్లు, గోదావరి నీళ్ల మళ్లింపుకు 8 వేల కోట్లు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ల కోసం 20 వేల కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం.. ఉద్యోగుల దగ్గరకు వచ్చేసరికి డబ్బులు లేవని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ పెంచడంతో తెలంగాణ ఓడి లిమిట్ రూ.1400 నుంచి రూ.2400 పెరిగిందన్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు 1వ తారీఖున చెల్లిస్తుందని తప్ప కాంగ్రెస్ ప్రభుత్వ ఘనకార్యం ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రెండు నెలల్లో బెనిఫిట్లు అందిస్తే.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కమిషన్లు ఇస్తే.. కోర్టు కు వెళ్లితే తప్ప పైసలు రాని పరిస్థితి నెలకుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంకు చిన్న చూపు చూస్తున్న ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులే కాంగ్రెస్ ప్రభుత్వం భరతం పట్టడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు. సిద్దిపేటపై ఈర్ష్యతో వెటర్నరీ కాలేజీ, వెయ్యి పడకల ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీ పనులను అడ్డుకుంటున్నారన్నారు. రెండేళ్ల రెండు నెలలు అయ్యే సరికి ప్రజలు కేసీఆర్ పాలననే బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో మీలో ఒక్కడి లా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా నిలదీస్తాం పోరాడు తానని హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story