- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గూడెం గుండెల్లో ఆ కుటుంబం..!
దిశ, పాపన్నపేట : రాజకీయాల్లో విలువలు లేవు.. డబ్బులు ఉంటేనే పదవీ అనే ప్రచారం ప్రతి ఒక్కరిలో ఉంది. ఎంత సేవ, అభివృద్ధి చేసినా మళ్ళీ జరిగే ఎన్నికల్లో

దిశ, పాపన్నపేట : రాజకీయాల్లో విలువలు లేవు.. డబ్బులు ఉంటేనే పదవీ అనే ప్రచారం ప్రతి ఒక్కరిలో ఉంది. ఎంత సేవ, అభివృద్ధి చేసినా మళ్ళీ జరిగే ఎన్నికల్లో గెలుపు కష్టమే అనే భావన ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్పష్టంగా తెలిసింది. కానీ ఓ కుటుంబం ఐదు దశబ్దాలుగా ఎన్నిక ఏదైనా ఓటమి ఎరగకుండా గెలుపు బావుటా ఎగరవేస్తూ రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పారు. ఒక్క సారి రెండు సార్లు కాదు దాదాపు ముప్పై సంవత్సరాల కాలంగా ఒకే కుటుంబం సర్పంచ్ పీఠం పై నిలుస్తూ శబాష్ అంటూ ప్రశంశలు పొందుతుంది. ఒక్క సర్పంచ్ పదవే కాదు ఆ కుటుంబం నుంచి ఉపసర్పంచ్, సోసైటీ డైరెక్టర్, జడ్పీటీసీ, ఏడుపాయల చైర్మన్ గా ఎన్నికై ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. తరతరాలుగా గూడెం ప్రజలంతా సాతెల్లి కుటుంబాన్ని ఆదరిస్తూనే ఉన్నారు. ఎన్నిక ఏదైనా గెలుపు సాతెల్లి కుటుంబానిదే అవుతుంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటూ విస్తృతంగా సేవలందిస్తున్న ఆ కుటుంబాన్ని తరతరాలుగా గ్రామ ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు. పాపన్న పేట మండల పరిధిలోని గాజుల గూడెం గ్రామంలో గత అర్థ శతాబ్దం కాలంగా సాతల్లి కుటుంబమే రాజకీయ దిశను నిర్దేశిస్తుంది. 1971లో సాతల్లి రామా గౌడ్ తో మొదలైన రాజకీయ ప్రస్థానం నేటికీ మూడు తరాలుగా గ్రామ రాజకీయాలను శాసిస్తుంది. ప్రస్తుతం గ్రామం లో 1070 మంది జనాభా ఉండగా, 833 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం జరిగిన గ్రామ పంచాయతి ఎన్నికల్లో సర్పంచ్ పదవి మరో మారు ఆ కుటుంబానికే దక్కడంతో గ్రామం మీద సాతెల్లి కుటుంబ పట్టు మరోమారు స్పష్టమయింది.
1971లో సర్పంచ్ గా మొదలైన ప్రస్థానం..
బాచారం గ్రామ పంచాయతీ పరిధిలో గాజులగూడెం గ్రామం మధిర గ్రామం గా ఉండేది. అప్పటి సర్పంచ్ ఎన్నికల్లో తొలి సారి సాతెల్లి రామగౌడ్ 1971 లో బాచారం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గెలుపొందాడు. అనంతరం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గాజులగూడెం గ్రామం చిత్రియాల గ్రామ పంచాయతీ లో మధిర గ్రామంగా ఉండేది. 1981 నుండి 1995 వరకు పదిహేను సంవత్సరాల పాటు మూడు పర్యాయాలు సర్పంచ్ గా పని చేసాడు. అనంతరం 1995 లో తొలిసారి గాజులగూడెం ప్రత్యేక పంచాయతీ కి జరిగిన ఎన్నికల్లో రామాగౌడ్ కుమారుడు సాతెల్లి లక్ష్మినారాయణ ఉప సర్పంచ్ గా గెలుపొందాడు. అనంతరం 2001 నుండి 2011 వరకు పది సంవత్సరాల పాటు లక్ష్మి నారాయణ కుమారుడు సాతెల్లి బాలాగౌడ్ రెండు పర్యాయలు సర్పంచ్ గా గెలుపొందాడు. అనంతరం 2013 లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సాతెల్లి మణెమ్మ సర్పంచ్ గా గెలిచారు. అదే సంవత్సరము జరిగిన సోసైటీ ఎన్నికల్లో బాలాగౌడ్ డైరెక్టర్ గా గెలుపొందడమే కాకుండా తన భార్య సాతెల్లి స్వప్న 2014 తెలంగాణ ఆవిర్భావ అనంతరం జరిగిన ప్రదేశిక ఎన్నికల్లో పాపన్నపేట మండల జడ్పీటీసీగా గెలుపొందారు. అనంతరం 2022 నుండి 2024 వరకు బాలాగౌడ్ ప్రసిద్ధ దేవాలయం అయినా ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సాతెల్లి మణెమ్మ గాజులగూడెం పంచాయతీ సర్పంచ్ గా గెలుపొందారు.
గ్రామమే కుటుంబం... గ్రామస్తులే కుటుంబ సభ్యులు సాతెల్లి బాలాగౌడ్
గత మూడు తరాలుగా మా కుటుంబం గ్రామస్తుల సేవలోనే ఉన్నాం. మా తాత రామాగౌడ్ చూపిన బాటలో ప్రస్తుతం మేము కూడా నడుస్తున్నాం. గ్రామమే మా కుటుంబంగా గ్రామస్తులే మా కుటుంబ సభ్యులుగా భావిస్తూ ప్రజాసేవకి అంకితమయ్యాం. గ్రామ అభివృద్ధిలో మా కుటుంబ కృషి చూసి గ్రామస్తులు మాకు తోడుగా నిలుస్తున్నారు. అందుకే ఐదు దశాబ్దాలుగా మూడు తరాలుగా గ్రామస్తులు మా కుటుంబంతోనే ఉన్నారు. మా గ్రామస్తుల కృషి తోడ్పాటుకు ఎప్పుడు రుణపడి ఉంటాం.






