కరెన్సీ పై గాంధీ బొమ్మ ను తొలగించే కుట్రలను తిప్పి కొట్టాలి : టీజీఐఐసీ చైర్ ప‌ర్స‌న్ నిర్మ‌లా జ‌గ్గారెడ్డి

by Ratna Kumari |   (  Updated:2026-01-05 13:56:07  IST  )

భారత కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మను తొలగించే కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టాలని టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పిలుపునిచ్చారు.

కరెన్సీ పై గాంధీ బొమ్మ ను తొలగించే  కుట్రలను తిప్పి కొట్టాలి : టీజీఐఐసీ చైర్ ప‌ర్స‌న్ నిర్మ‌లా జ‌గ్గారెడ్డి
X

దిశ, సంగారెడ్డి : భారత కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మను తొలగించే కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టాలని టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో మూడు రోజుల పాటు జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా ఆదివాసి కార్యకర్తల, నాయకుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆమెతో పాటు ఎంపీ సురేష్ శెట్కార్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్, నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణా శిబిరం లో పాల్గొన్న కార్యకర్తలకు ముఖ్య అధితుల చేతుల మీదుగా వారికి ప్రశంస పత్రాలు అందజేశారు. ఆదివాసీల హక్కులు, సంక్షేమ పథకాలపై అవగాహన ప్రధాన ఎజెండా గా జరిగిన ఈ శిక్షణా కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉద్యోగ అవకాశం కల్పిస్తాం

ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ శిక్షణా కార్యక్రమం లో ప్రతి ఒక్కరూ సిన్సియర్ గా చాలా ఇష్టంగా పాల్గొన్నారన్నారు. ఇలాంటి క్యాంపు సంగారెడ్డిలో జరగడం సంతోషంగా ఉందని తెలిపారు. నారాయణఖేడ్ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఆ ప్రాంతంలో ఇండస్ట్రియల్ ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగ అవకాశం కలిపిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి లాంటిదన్నారు. దేశ స్వాతత్ర్యం కోసం పోరాటం చేయని వారు గాంధీ బొమ్మను తొలిగించాలని కుట్ర చేస్తున్నారని అందరం ఏక‌మై అలాంటి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇతర పార్టీలు మాటలతో సరిపెట్టుకుంటారు కానీ కాంగ్రెస్ పార్టీ ఆలా కాదనీ ఇచ్చిన మాటను నిలబెట్టుకొని తీరుతుందని వివరించారు. అదివాసీ శిక్షణలో జరిగిన చర్చలు, విషయాలను బయట చెర్చించా లని కోరారు. అనంతరం ఎంపీ సురేష్ శెట్కార్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తీసేసి కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందన్నారు. కేంద్రం చర్యలకు వ్యతిరేకం గా పార్లమెంట్ లో పోరాటం చేస్తామన్నారు. గరిబోళ్ల కు ఉపాధి కల్పించకుండా, గరిబోళ్లను పెంచే విదంగా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు.

Next Story