మహమ్మద్ షాపూర్‌లో ఉద్రిక్తత

by Bhanu |   (  Updated:2025-12-11 13:58:11  IST  )

మమ్మద్ షాపూర్ గ్రామంలో ఎన్నికల బందోబస్తులో ఉన్న ఓ కానిస్టేబుల్ వ్యవహార శైలి ఉద్రిక్తతకు దారి తీసింది.

మహమ్మద్ షాపూర్‌లో ఉద్రిక్తత
X

దిశ,దౌల్తాబాద్: మండలం మమ్మద్ షాపూర్ గ్రామంలో ఎన్నికల బందోబస్తులో ఉన్న ఓ కానిస్టేబుల్ వ్యవహార శైలి ఉద్రిక్తతకు దారి తీసింది. కానిస్టేబుల్ పోలింగ్ స్టేషన్‌కి 200 మీటర్ల దూరంలో ఉన్న వారిపైకి లాఠీ ఛార్జి చేయడానికి దూసుకెల్లడంతో భయంతో ప్రజలు పరుగులు తీశారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గాయపడ్డాడని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. కాగా సదర్ కానిస్టేబుల్ రాత్రి వేళలో కూడా బందోబస్తు విధులలో ఉన్నప్పుడు గ్రామానికి చెందిన యువకులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా శాంతి పద్ధతులు కాపాడాల్సిన పోలీసు ఇలాంటి ప్రవర్తన చూపడం బాధాకరమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు పోరాడుతామని పేర్కొన్నారు.

Next Story