సోషల్ మీడియాపై నిఘా మరింత కఠినతరం : ఎస్పీ మహేష్ బి.గితే

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-11-27 12:12:00  IST  )

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : గ్రామ‌పంచాయ‌తీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా జిల్లాలో సోష‌ల్ మీడియా పై నిఘా క‌ఠిన‌త‌రం చేసిన‌ట్టు ఎస్పీ మ‌హేష్ బి.గితే తెలిపారు. వర్గాల మధ్య

సోషల్ మీడియాపై నిఘా మరింత కఠినతరం : ఎస్పీ మహేష్ బి.గితే
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : గ్రామ‌పంచాయ‌తీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా జిల్లాలో సోష‌ల్ మీడియా పై నిఘా క‌ఠిన‌త‌రం చేసిన‌ట్టు ఎస్పీ మ‌హేష్ బి.గితే తెలిపారు. వర్గాల మధ్య విద్వేషాలు రేచ్చగోట్టేలా ప్రజలను తప్పుదోవ పట్టించేలా వచ్చే ప్రకటనలు పోస్ట్ చేసిన,షేర్ చేసిన వారితో పాటు గ్రూప్ అడ్మిన్ లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. పోలీస్ కార్యాలయంలో గురువారం ఆయన పోలీసు అధికారులతో పంచాయితి ఎన్నికలకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గ్రామపంచాయ‌తీ ఎన్నికలు మూడు విడుతాలలో జరిగే ఎన్నికలు పూర్తి స్థాయి పటిష్ట భద్రత ఏర్పాట్లతో ప్రశాంత వాతవరణంలో నిర్వహిద్దామని, ఎన్నికల నిర్వహణలో ఇప్పటికే అనుభవం ఉన్న అధికారులు, సిబ్బంది నూతనంగా డిప్లాయ్ అయిన సిబ్బందికి మార్గదర్శనం చేస్తూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎన్నికల నియమావళికి విరుద్దంగా వ్యవహరించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేస్తూ అక్రమ మద్యం, నగదు, ఉచితల పంపిణీపై నిఘా ఉంచుతూ, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు, డైనమిక్ చెక్ పోస్ట్ లు పెట్టి తనిఖిలు చేపట్టాలని ఆదేశించారు.

నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, జిల్లాలోని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచుతూ అధికారులు తరచుగా పర్యటిస్తూ పరిస్థితులను నియంత్రణలో ఉంచాలని తెలిపారు. ఎన్నికల అనంతరం నిర్వహించే విజయోత్సవ ర్యాలీలపై కూడా ప్రత్యేక నిఘా ఉంచి, ప్రజా శాంతి భద్రతలకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా గతంలో ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడిన నెరస్థులతో పాటు, ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడేవారు,రౌడి షీటర్స్ పై, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిఘా ఉంచి,అవసరం అయితే బైండోవర్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సిరిసిల్ల డిఎస్పి నాగేంద్ర చారి , ఇన్స్పెక్టర్లు మొగిలి ,శ్రీనివాస్ , వీరప్రసాద్ , శ్రీనివాస్ , వెంకటేశ్వర్లు , రవి , నాగేశ్వరరావు , సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు

శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం.. నవంబర్ 30 వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ తెలిపారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాద‌ని నిబంధనలకు విరుద్ధంగా డి.జే వినియోగించారాదని తెలిపారు. శాతిభద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. జిల్లా ప్రజలు పోలీసు వారికి ఈ విష‌యంలో సహకరించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సూచించారు.

Next Story