విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలి

by Naveena |

విద్యార్ధులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటి సాధన దిశగా అడుగులు వేయాలని ఎంపీడీవో స్వర్ణకుమారి అన్నారు.

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలి
X

దిశ, ములుగు : విద్యార్ధులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటి సాధన దిశగా అడుగులు వేయాలని ఎంపీడీవో స్వర్ణకుమారి అన్నారు. ములుగు మండల పరిధిలోని సింగన్నగూడ ప్రాథమిక పాఠశాలకు తాజామాజి సర్పంచ్ బొల్లెపల్లి బాలకృష్ణ, తాజామాజి ఉపసర్పంచ్ కాంచనపల్లి స్వామిగౌడ్ సహకారంతో రూ. 26 వేలు విలువ చేసే ఫర్నీచర్ను విద్యార్ధుల సౌఖర్యార్ధం పాఠశాలకు బహుకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఎంపీడీవో స్వర్ణకుమారి హాజరై మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిలో విద్యార్ధి దశ ఎంతో కీలకమైనదని, దానిని ప్రతి విద్యార్ధి సద్వినియోగం చేసుకొని తమ తల్లితండ్రుల కలలను నిజం చేయాలని కోరారు. పాఠశాలకు ఫర్నీచర్ను బహుకరించిన బాలకృష్ణ, స్వామిగౌడ్లను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎంఈవో ఉదయభాస్కర్ రెడ్డి, హెచ్ఎమ్ క్రాంతికుమారి, గ్రామ ప్రత్యేకాధికారి రాంచంద్రం, పంచాయతీ కార్యదర్శి సతీశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story