- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెనూ ప్రకారమే విద్యార్థులకు భోజనం ఇవ్వాలి
మెనూ ప్రకారమే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిద్దిపేట జేసీ గరిమ అగర్వాల్ అన్నారు. మంగళవారం కోహెడ మండలంలోని కేజీబీవీ ఆకస్మికంగా సందర్శించారు.

దిశ, కోహెడ : మెనూ ప్రకారమే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిద్దిపేట జేసీ గరిమ అగర్వాల్ అన్నారు. మంగళవారం కోహెడ మండలంలోని కేజీబీవీ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. పాఠశాల పరిశుభ్రత, టాయిలెట్స్ నిర్వహణ, వంట సామాగ్రి నిలువ, తరగతి గదుల నిర్వహణ, భోజన వసతుల ఏర్పాటు, విద్యార్థుల ఆరోగ్యం, నీటి సరఫరా, వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంటు నిర్వహణ, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, హెల్త్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు విద్యార్థుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని, సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ… రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంచాలని కోరారు.
పాఠశాలలో ఉన్న సమస్యల గురించి వివరించిన ఉపాధ్యాయులు
పాఠశాలలో ఉన్న నీటి సమస్య, డార్మెటరీ సమస్య గురించి పాఠశాల యాజమాన్యం అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. డార్మెటరీ మంజూరి అయినది త్వరలోనే నిర్మాణం చేపడతారని తెలుపుతూ, మిగతా సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని తెలియజేశారు. అనంతరం తంగళ్ళపల్లి, శనిగరం గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి తగిన సూచనలు చేశారు. శనిగరం అంగన్వాడి ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ఎల్లంకి శ్రీనివాస రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ హరీష్ కుమార్, తహసీల్దార్ సురేఖ, మండల వైద్యాధికారిణి డాక్టర్ నిమ్రా, మండల విద్యాధికారి పద్మయ్య, ఇన్చార్జి ఎంపిఓ శోభా, సిడిపిఓ జయమ్మ, ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత, పంచాయతీ కార్యదర్శి రమేష్, ప్రధానోపాధ్యాయులు హేమ బిందు, భాగ్యలక్ష్మి,ఉపాధ్యాయులు,అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
- Tags
- Mid-Day Meals






