- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంగన్ వాడీ టీచర్ ను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : డాక్టర్ దిగ్గె బాబు
కంగ్టి మండలం రాసోల్ గ్రామంలో అంగన్ వాడీ టీచర్‌ను చెట్టుకు కట్టి అవమానపరిచిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ దిగ్గే బాబు డిమాండ్ చేశారు.

దిశ, నారాయణఖేడ్ : కంగ్టి మండలం రాసోల్ గ్రామంలో అంగన్ వాడీ టీచర్‌ను చెట్టుకు కట్టి అవమానపరిచిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ దిగ్గే బాబు డిమాండ్ చేశారు. గురువారం సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. ఖైసర్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 7న కంగ్టి మండలం రాసోల్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు, టీచర్ భర్త హెచ్‌బిఎస్ ఫైనాన్స్ పేరిట డబ్బులు తీసుకొని మోసం చేశాడని ఆరోపిస్తూ, అంగన్ వాడీ టీచర్‌ను చెట్టుకు తాడుతో కట్టి నిర్బంధించడం అత్యంత అమానుష చర్య అని పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఇప్పటికే కోర్టులో విచారణలో ఉన్నప్పటికీ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఒక మహిళను ప్రజల మధ్య అవమానపరచడం తీవ్రంగా ఖండించదగ్గదని అన్నారు. ఇలాంటి చర్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనలో పాల్గొన్న వారి పై వెంటనే చట్టరీత్య చర్యలు తీసుకుని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ పూర్తిగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.






