- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీఐపీలకు స్పెషల్ ట్రీట్మెంట్..
వారంతా వివిధ కేసుల్లో శిక్ష నిమిత్తం రిమాండ్ ఖైదీలుగా జైలుకు వచ్చారు.

దిశ, సంగారెడ్డి: వారంతా వివిధ కేసుల్లో శిక్ష నిమిత్తం రిమాండ్ ఖైదీలుగా జైలుకు వచ్చారు. అందరితోపాటు వారికి కూడా ఒకే విధంగా జైలులో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో అలాగే వారిని కూడా చూడాలి. కానీ వారు అందరిలాగా మామూ లు రిమాండ్ ఖైదీలు కారు. డబ్బు, పలుకుబడితో కూడిన వీఐపీ ఖైదీలు. అందుకే ఆ వీఐపీ ఖైదీలకు కొంతమంది జైలు సిబ్బంది దాసోహం పలుకుతున్నారు. వారు కోరినవన్నీ లేదనుకుండా సకల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చి వారి సేవలో తరిస్తున్నారు. ఈ ఉదంతాలు అంతా సంగా రెడ్డి సెంట్రల్ జైలులో గత కొంతకాలంగా సాగుతుండగా ఇప్పుడు ఇదే బయట హాట్ టాపిక్ గా మారింది.
మర్యాదలో లోటు లేదు..
సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఒక ఆరు మంది రిమాండ్ ఖైదీలు డబ్బు, పలుకుబడి ఉన్న బడా వ్యక్తులు. అందులో ఈ మధ్యనే కోర్టు తీర్పుతో ఇదే జైలులో శిక్ష నిమిత్తం వచ్చిన సిగాచి పరిశ్రమ ఎండి ఒకరు. అయితే వీరికి అందరు ఖైదీలలాగా కాకుండా వేరే విధంగా వారికి కొందరు జైలు సిబ్బంది రాచమర్యాదలు అందిస్తున్నారు. కావలసినవారికి చెయ్యి కింద ఒక పనోడు, ఒక వంట మనిషిని కూడా వారికోసం అందుబాటులోకి తెచ్చి పెట్టినట్లు సమాచారం. ఇదంతా ఊరికే ఏం కాదు. విఐపి సేవలు అందించినందుకు వారి మామూలు వారికి అందాల్సిందే. ఈ విషయాలన్నీ జైలులో ఖైదీలను కలిసేందుకు మూలాఖాత్ సమయంలో తమ వారితో మాట్లాడుతుండగా కొందరి ద్వారా బయటికి వచ్చిన విషయాలు అని తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా కూడా ఉన్నతాధికారులు కనీసం స్పందించకపోవడం ఏమిటా అని అదే జైలులోని ఇతర సిబ్బంది చర్చ.
గతంలో కూడా ఒకసారి వార్నింగ్..
సంగారెడ్డి జైలులో కొంతమంది ఖైదీల ద్వారా వారికి సౌకర్యాలు ఇతర వసతులు కల్పించేందుకు ఫోన్ పే ద్వారా వారి బంధువుల నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోము. ఇప్పటికైనా సిబ్బంది తమ పనితీరును మార్చుకోకపోతే చర్యలు తప్పవు. అని ఇదే సందేశాన్ని జైలు సూపరింటెండెంట్ కళాసాగర్ వాట్సాప్ లో జైలు లో పనిచేసే సిబ్బందికి పంపించడం జరిగింది. ఆ సందేశం పొరపాటున వేరే గ్రూపులో వేయడం ద్వారా అధికాస్తా బయటకు వచ్చింది. జైలు ఉన్నతాధికారి హెచ్చరించినా కూడా కొంతమంది సిబ్బందిలో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం.
వేటు వేస్తే కానీ రూటు మారదు..
సంగారెడ్డి సెంట్రల్ జైలులో కొంతమంది సిబ్బంది చేసే పనులవల్ల జైలు శాఖకు మచ్చను తెచ్చిపెట్టేలా ప్రస్తుత వ్యవహారాలు జరుగుతున్నాయి. గతంలో సంగారెడ్డి జైలు అంటే ఎంతో ఆదర్శంగా ఉండేదని, అలాంటిది ఇప్పుడు వరుస వివాదాలు, ఇతర కారణాలతో సంగారెడ్డి జైలు పేరును పూర్తిగా పాడు చేసేలా చేస్తున్నారంటూ కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదంతాలను అన్ని రాష్ట్ర జైలు శాఖ ఉన్నతాధికారులు పరిశీలించి అలాంటి సిబ్బందిపై వేటు వేస్తే గాని వారు దారిలోకి రారంటూ స్థానికులు కొంతమంది సిబ్బంది చర్చించుకుంటున్నారు.






