- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భక్త మార్కండేయ ఆలయంలో సంకట హర చతుర్థి పూజలు
నారాయణఖేడ్ వెంకటాపూర్ చౌరస్తాలోని భక్త మార్కండేయ ఆలయంలో సోమవారం సంకష్ట చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

దిశ, నారాయణఖేడ్: నారాయణఖేడ్ వెంకటాపూర్ చౌరస్తాలోని భక్త మార్కండేయ ఆలయంలో సోమవారం సంకష్ట చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భక్త మార్కండేయ చంద్రమౌళీశ్వర స్వామికి గణపతి పూజ, లింగాభిషేకం, మహాహారతి కార్యక్రమాలు నిర్వహించగా.. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ పురోహితులు బ్రహ్మశ్రీ గురురాజు శర్మ దంపతులను, పద్మశాలి సంఘం కోశాధికారి చిప్ప అనంతం దంపతులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో.. పద్మశాలి కుల బాంధవులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయం భూమి పూజ మొదల నుంచి ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు బ్రహ్మశ్రీ గురురాజు పురోహితుల బృందం నుండి అందించిన సేవలు అనిర్వచనీయమని కొనియాడారు. అత్యంత నియమ నిష్ఠలతో బ్రహ్మ సూత్ర లింగాన్ని ఆలయంలో ప్రతిష్టించడంతోపాటు ఆలయాన్ని సుందరంగా నిర్మించడంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ఆ భక్త మార్కండేయుడి కృపాకటాక్షాలు ఎల్లవేళలా భక్తులపై ఉండాలని బ్రహ్మశ్రీ గురురాజు శర్మ అన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చిప్ప అనంతం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ నిర్వహక కమిటీ బాధ్యులు,పట్టణ చుట్టు పక్కల గ్రామాల నుండి వచ్చిన భక్తులు,పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు.






