హరిత హారం చెట్టును నరికిన వ్యక్తికి జరిమానా..

by Disha Web |
హరిత హారం చెట్టును నరికిన వ్యక్తికి జరిమానా..
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: నిబందనలకు విరుద్దంగా హరితహారం చెట్టును నరికిన వ్యక్తికి సిద్దిపేట మున్సిపాల్ అధికారులు రూ.10 వేలు జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్లితే.. 20 వ వార్డు పరిధిలో సయ్యద్ రియాజ్ హరిత హారంలో నాటిన మొక్కను నరికాడు. దీంతో స్థానికుల ఫిర్యాదు మేరకు హరితహారం అధికారి సామల ఐలయ్య సదరు వ్యక్తికి రూ.10 వేలు జరిమానా విధించారు. హరితహారంలో నాటిన మొక్కలను నరికి వేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.Next Story