రాజ్యాంగానికి విరుద్ధంగా శ్రమశక్తి నీతి లేబర్ పాలసీ : సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అతిమేల మాణిక్

by Ratna Kumari |

దిశ, పటాన్ చెరు టౌన్ : శ్రమశక్తి నీతి - 2025 లేబర్ పాలసీ కార్మికులకు వ్యతిరేకంగా ఉందని, పెట్టుబడుదారుల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం దీనిని తీసుకొస్తుందని సీఐటీయూ జిల్లా

రాజ్యాంగానికి విరుద్ధంగా శ్రమశక్తి నీతి లేబర్ పాలసీ : సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అతిమేల మాణిక్
X

దిశ, పటాన్ చెరు టౌన్ : శ్రమశక్తి నీతి - 2025 లేబర్ పాలసీ కార్మికులకు వ్యతిరేకంగా ఉందని, పెట్టుబడుదారుల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం దీనిని తీసుకొస్తుందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అతిమేల మానిక్, పి. పాండు రంగారెడ్డి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శనివారం పటాన్ చెరు పట్టణంలోని శ్రామిక భవన్ లో "శ్రమశక్తి నీతి - 2025" నూతన లేబర్ పాలసీ పైన నీయాఫ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్ లో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ ను దొడ్డి దారిన అమలు చేసేందుకు శ్రమశక్తి నీతి - 2025 నూతన లేబర్ పాలసీనీ తీసుకొస్తుందని ఆరోపించారు. కరోనా సమయంలో 29 రకాల కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కొడ్స్ తెచ్చిందని, దేశవ్యాప్తంగా కార్మికల ఆందోళనలు పోరాటాలు సమ్మెతో అమలు చేయకుండా మోడీ ప్రభుత్వం వెనుకకు తగ్గిందని చెప్పారు. మరోసారి లేబర్ కోడ్స్ ను దొడ్డి దారిన అమలు చేసేందుకే శ్రమశక్తి నీతి 2025 నూతన లేబర్ పాలసీని తీసుకొచ్చిందని విమర్శించారు. ఇది పూర్తిగా కార్మికులకు, రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. కార్మికుల హక్కుల మీద కేంద్ర ప్రభుత్వం శ్రమ శక్తి నీతి లేబర్ పాలసీ పేరుతో తీవ్రంగా దాడి చేస్తుందని మండిపడ్డారు. కార్మికులకు అవగాహన కల్పించేందుకు సిఐటియు ఆధ్వర్యంలో సెమినార్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.కార్మికులకు వ్యతిరేకమైన శ్రమశక్తి నీతి లేబర్ పాలసీని వెంటనే ఉపసంహరించుకోవాలని, ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ను వెంటనే సమావేశపరిచి పాలసీ పైన చర్చించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సెమినార్ లో యూనియన్ జనరల్ సెక్రెటరీ మదన్ రెడ్డి నాయకులు మూర్తి, గణపతి, మహేష్, సీతారాం పాల్గొన్నారు.

Next Story