కాంగ్రెస్ పార్టీ కి సేవాదళ్ వెన్నెముక లాంటిది

by Ratna Kumari |

కాంగ్రెస్ పార్టీకి సేవాదళ్ వెన్నుముక లాంటిదని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు.

కాంగ్రెస్ పార్టీ కి సేవాదళ్ వెన్నెముక లాంటిది
X

దిశ‌, సంగారెడ్డి : కాంగ్రెస్ పార్టీకి సేవాదళ్ వెన్నుముక లాంటిదని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగమైన సేవాదళ్ ఆధ్వర్యంలో మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో "సమర్థ శిక్షణ శిబిరం" ఘనంగా నిర్వహించారు. పార్టీ క్రమశిక్షణను కాపాడుతూ, ప్రజా సేవే లక్ష్యంగా కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నిర్మలా జగ్గారెడ్డి హాజరయ్యారు. ముందుగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సేవాదళ్ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ విధి, విధానాలు, క్రమశిక్షణ మరియు సేవా దృక్పథంపై ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, రాబోయే రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి పార్టీ సంస్థాగత బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ శిక్షణా శిబిరంలో చ‌ర్చించ‌డం సంతోషకరం అన్నారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సేవాదళ్ వెన్నెముక వంటిదని, కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లో సేవాదళ్ కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. క్షేత్రస్థాయిలో నాయకత్వ లక్షణాలను ఎలా పెంపొందించుకోవాలనే అంశంపై ఈ శిబిరం లో వక్తలు దిశానిర్దేశం చేశారు.

Next Story