చౌటకూర్ లో కాంగ్రెస్ కు షాక్..!

by Ratna Kumari |

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సర్పంచుల సంఘం ఐక్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు అందోల్ కృష్ణ బీజేపీలో చేరారు.

చౌటకూర్ లో కాంగ్రెస్ కు షాక్..!
X

దిశ, చౌటకూర్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సర్పంచుల సంఘం ఐక్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు అందోల్ కృష్ణ బీజేపీలో చేరారు. సోమవారం హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో మాజీ ఎంపీబీబీ పాటిల్ అధ్వర్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. చౌటకూర్ మండలం చక్రియాల గ్రామానికి చెందిన అందోల్ కృష్ణ 2013లో ఆ గ్రామ సర్పంచుగా ఏకగ్రీవంగా ఎన్నికై సర్పంచుల సంఘం ఐక్య వేదికను స్థాపించారు. సర్పంచులకు నిధులు, విధులు, ఇతరాత్ర హక్కుల సాధన కోసం అనేక పోరాటాలు చేశారు. సామాజిక కార్యకర్త అన్నా హాజరే స్ఫూర్తితో రాష్ట్ర, ఢిల్లీ స్థాయిలో ఉద్యమాలు చేపట్టి సర్పంచుల హక్కులను సాధించగలిగారు. గ్రామాల్లో సర్పంచులకు గౌరవ వేతనం చెల్లించాలంటూ చేపట్టిన ఉద్యమానికి అప్పటి సీఎం కేసీఆర్ స్పందించి నెలకు రూ.7 వేలను చెల్లించడంలో ఆయన పాత్ర కీలకమనే చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడిగా వ్యవహరిస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గెలుపున‌కు కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీని మరింతగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. గ్రామ స్థాయిలో బీజేపీ కార్యకర్తలను కలుపుకుని సమన్వయంతో పనిచేస్తానన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం తధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Next Story