నేడు సర్పంచ్ ల ప్రమాణ స్వీకారం

by Thanuru Gopichand |

పంచాయతీల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరనున్నాను. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో సోమవారం కొత్త సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

నేడు సర్పంచ్ ల ప్రమాణ స్వీకారం
X

దిశ, సంగారెడ్డి బ్యూరో: పంచాయతీల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరనున్నాను. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో సోమవారం కొత్త సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ వెంటనే బాధ్యతల్లో చేరనున్నారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ ఇలా ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 72మండలాల్లో 1613 గ్రామ పంచాయతీలున్నాయి. ఈ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. సర్పంచ్ లు గా ఎన్నికైన వారు అధికారికంగా నేడు బాధ్యతల్లో చేరనున్నారు. ఈ క్రమంలో అన్ని పంచాయతీల్లో అధికారులు తగు ఏర్పాట్లు చేశారు.

మొదట సర్పంచ్ ల ప్రమాణం..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీల్లో మొదట సర్పంచ్ లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తరువాత ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణం చేస్తారు. ఆ తరువాత సర్పంచ్ లు పంచాయతీల్లో తమ స్థానాల్లో కూర్చుని బాధ్యతల్లో చేరుతారని అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 613, సిద్దిపేటలో 508, మెదక్ జిల్లాలో 492 గ్రామ పంచాయతీలున్నాయి. ఆయా పంచాయతీల్లో మూడు విడత్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. కాగా తమ పార్టీ బలపరచిన అభ్యర్థులు సర్పంచ్ లు అయిన చోట ఆయా గ్రామాల్లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో పార్టీల ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఈ మేరకు సర్పంచ్ లు తమ పార్టీ నాయకులకు స్వాగతం పలుకుతూ భారీ స్థాయిలో ప్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు.

పలు గ్రామాల్లో రంగంలోకి సర్పంచ్ లు..

సర్పంచ్ లు ప్రమాణ స్వీకారం చేయకపోయినప్పటికీ చాలా గ్రామాల్లో కొత్త సర్పంచ్ లు గ్రామ పాలనలో దిగిపోయారు. ఆయా గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీల సారథ్యంలో పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా గ్రామాల్లో పాలన కుంటు పడింది. మురికి కాలువలు, పారిశుద్ధ్య వ్యవస్థ అస్థవ్యస్థంగా మారింది. వీధి లైట్లు కూడా మార్చలేని పరిస్థితుల్లో చాలా గ్రామాలున్నాయని చెప్పుకోవచ్చు. కొత్త సర్పంచ్ ల ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో గ్రామాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయని గ్రామస్తులు బావిస్తున్నాయి. పలు గ్రామాల్లో కొత్త సర్పంచ్ లు బాధ్యతలు చేపట్టకపోయినా వీధి లైట్లు వేయించడంతో పాటు గ్రామాలకు వచ్చే గుంతలను మట్టితో పూడ్చి వేయించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Next Story