- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామాలలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి : ఎంపీడీవో శ్రీనివాస్ వర్మ
గ్రామాలలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఎంపీడీవో శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. సోమవారం జగదేవపూర్ మండలం తిగుల్ లో పర్యటించారు.

దిశ, జగదేవపూర్ : గ్రామాలలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఎంపీడీవో శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. సోమవారం జగదేవపూర్ మండలం తిగుల్ లో పర్యటించారు. గ్రామపంచాయతీ ఆవరణలో ఉన్న నర్సరీని సర్పంచ్ రజితతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఎక్కడ పిచ్చి మొక్కలు చెత్త చెదారం లేకుండా పారిశుద్ధ్య నిర్మూలన చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. నర్సరీలో నూతన మొక్కల పెంపకం, నర్సరీ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ అభివృద్ధి పనులను ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ఎంపీడీవో శ్రీనివాస్ వర్మకు సర్పంచ్ రజిత, ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డిలు శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ భూమయ్య, మాజీ సర్పంచ్ ఎల్లయ్య, స్థానిక నాయకులు అశోక్, ఎల్లారెడ్డి, మహేందర్ రెడ్డి, కార్యదర్శి నరేందర్ పాల్గొన్నారు.






