దేవాలయ అభివృద్ధికి రూ. లక్ష విరాళం..

by Kodari Anjali |

నియోజకవర్గం డివిజన్ జేపీ కాలనీ పరిధిలోని సాయి గణేష్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయ స్థిర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు.

దేవాలయ అభివృద్ధికి రూ. లక్ష విరాళం..
X

దిశ, పటాన్‌చెరు టౌన్: నియోజకవర్గం డివిజన్ జేపీ కాలనీ పరిధిలోని సాయి గణేష్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయ స్థిర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ అభివృద్ధి కొరకు తన వంతుగా సహాయంగా రూ. లక్ష విరాళంగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలు సమాజంలో ఐక్యత, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించే కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు కలిసి ఆలయాన్ని అభివృద్ధి పరచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రాంరెడ్డి, మాజీ అధ్యక్షుడు సంతోష్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, శ్రీధర్, నరేష్, సంతోష్, కాలనీకి చెందిన నాయకులు, పెద్దలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Next Story