డ్రగ్స్ ముఠా ఆట కట్టించిన ఎస్సై మురళికి రివార్డ్..

by Kodari Anjali |   (  Updated:2026-04-25 13:12:40  IST  )

విధి నిర్వహణలో అసాధారణ ప్రతిభ కనబరిచిన జహీరాబాద్ ఎక్సైజ్ ఎస్సై మురళి అరుదైన గౌరవం అందుకున్నారు.

డ్రగ్స్ ముఠా ఆట కట్టించిన ఎస్సై మురళికి రివార్డ్..
X

దిశ, జహీరాబాద్: విధి నిర్వహణలో అసాధారణ ప్రతిభ కనబరిచిన జహీరాబాద్ ఎక్సైజ్ ఎస్సై మురళి అరుదైన గౌరవం అందుకున్నారు. గత ఏడాది అక్రమ డ్రగ్స్ రవాణాను అడ్డుకోవడంలో ఆయన చూపిన చొరవకు గాను ఉన్నతాధికారుల నుండి నగదు రివార్డును అందుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 2న నిర్వహించిన తనిఖీల్లో భాగంగా, గోవా నుండి హైదరాబాద్‌కు తరలిస్తున్న భారీ డ్రగ్స్ ముఠాను ఎస్సై మురళి పట్టుకున్నారు. ప్రాణాలకు తెగించి దాదాపు 47 కిలోల అక్రమ డ్రగ్స్ స్వాధీనం చేసుకుని, స్మగ్లర్ల నెట్‌వర్క్‌ను దెబ్బతీశారు.

రూ. 25,000 నగదు రివార్డు

ఎస్సై సాహసోపేతమైన చర్యను గుర్తించిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం రూ. 25,000 నగదు రివార్డుతో పాటు ప్రశంసా పత్రం అందజేశారు. విధి నిర్వహణలో నిబద్ధతతో వ్యవహరిస్తే తగిన గుర్తింపు లభిస్తుందని మురళి నిరూపించారు. ఇతర అధికారులకు స్ఫూర్తిగా నిలిచాడని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మురళికి తోటి అధికారులు, స్థానికులు, ఉన్నతాధికారుల నుండి పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. డ్రగ్స్ రహిత సమాజం కోసం ఇలాంటి మరిన్ని చర్యలు చేపడతామని ఈ సందర్భంగా అధికారులు ధీమా వ్యక్తం చేశారు.

Next Story