- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ రెడ్డి మాటలు హాస్యాస్పదం
దిశ, గజ్వేల్ రూరల్ : గజ్వేల్ నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా స్థానాలను గెలిచిందని ముఖ్యమంత్రి

దిశ, గజ్వేల్ రూరల్ : గజ్వేల్ నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా స్థానాలను గెలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గజ్వేల్ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గెలిచిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచులను సెక్రటేరియట్ కు కానీ లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి తీసుకువస్తామని మీరు వారిని లెక్క పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి స్థాయిని మరిచి హుందాగా మాట్లాడింది పోయి అబద్ధాలు అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గజ్వేల్ నియోజకవర్గంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో 179 స్థానాలకు గాను బీఆర్ఎస్ పార్టీ 92 స్థానాలను గెలిచిందని, కాంగ్రెస్ పార్టీ 68 , బీజేపీ 5, ఇతరులకు 14 స్థానాలు వచ్చాయని తెలిపారు. ఇది తెలియక రేవంత్ రెడ్డి గజ్వేల్ లీడర్ల మోసపూరితమైన అబద్ధాలు నమ్మి మీడియా ముఖంగా అబద్దాలు చెప్పడం ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చి మాట్లాడడం చాలా విడ్డూరం అని తెలిపారు. ఇప్పటికైనా అసత్యాలు మాట్లాడటం మానుకుని ప్రజాపాలనపై ద్రుష్టి పెట్టాలని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్ సి రాజమౌళి, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, గజ్వేల్ మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ఉడెం కృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసిలు అనంతుల ప్రశాంత్, రామచంద్రం, కిష్టాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్ అలీ, నాయకులు మద్ది రాజిరెడ్డి, హైదర్ పటేల్, ఆకుల దేవేందర్, రఘుపతి రెడ్డి, పాల రమేష్ గౌడ్, ఉమర్, అహ్మద్ పాల్గొన్నారు.






