- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలి
రెండో విడత పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా జరిగే విధంగా ఎన్నికల సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని తూప్రాన్ ఆర్డిఓ జయచంద్ర రెడ్డి సూచించారు

దిశ,చేగుంట: రెండో విడత పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా జరిగే విధంగా ఎన్నికల సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని తూప్రాన్ ఆర్డిఓ జయచంద్ర రెడ్డి సూచించారు. గురువారం చేగుంట మండల పరిషత్ కార్యాలయంలో ఆర్వో, జోనల్ ఆఫీసర్స్, పంచాయతీ కార్యదర్శులకు ఎన్నికల నిర్వహణపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని 25 గ్రామపంచాయతీలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలన్నారు. ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తొందరగా వెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికలు జరిగే విధంగా పోలింగ్ కేంద్రాల్లో సంబంధిత అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిన్నారెడ్డి, తహసిల్దార్ శివప్రసాద్, ఎంఈఓ నీరజ, ఏవో హరిప్రసాద్, వివిధ గ్రామాల ఎన్నికల సిబ్బంది తదితరులు ఉన్నారు.
- Tags
- medak






