- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటర్ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్డీవో
మెదక్ జిల్లా టోనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను ఆర్డీవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

దిశ, మెదక్ టౌన్: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించే క్రమంలో శనివారం మెదక్ జిల్లా టోనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పరీక్షా కేంద్రాలను ఆర్డీవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షా హాళ్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల పనితీరు, పరీక్షల నిర్వహణ విధానాన్ని నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు వివరాలను ఆరా తీశారు. నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోనే ప్రశ్నాపత్రాలను తెరిచారా లేదా అన్నది పరిశీలించారు. సీసీ టీవీ నిఘా మధ్య ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారా అనే విషయాన్ని పరిశీలించారు.
పరీక్షా కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, మెడికల్ కిట్‌తో ఏఎన్‌ఎం అందుబాటులో ఉండటం, టాయిలెట్ వసతులు వంటి మౌలిక సదుపాయాలను కూడా పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షలు పూర్తయిన వెంటనే ఆన్సర్ షీట్లను తగిన పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు సురక్షితంగా తరలించాలని సూచించారు. ఎలాంటి కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకతతో, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఆర్డీవో స్పష్టం చేశారు.






