సంగారెడ్డిలో ఈదురు గాలులతో వర్షం.. పవర్ కట్

by Disha Web Desk 1 |
సంగారెడ్డిలో ఈదురు గాలులతో వర్షం.. పవర్ కట్
X

దిశ, సంగారెడ్డి : సంగారెడ్డిలో కురిసిన భారీ వర్షానికి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి కూడా పవర్ కట్ కొనసాగుతోంది. వర్షంతో పాటుగా పెద్ద ఎత్తున ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి చెట్లు విరిగిపడ్డాయి. కరెంట్ తీగలపై ఆ చెట్లు పడడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా కురిసిన వర్షానికి సంగారెడ్డిలోని పలు కాలనీల్లో రోడ్లపై నీరు నిలవడంతో పలు కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారు. పేరుకే గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అయినా.. అంతర్గత రహదారులు లేకపోవడంతో పాలు కాలనీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లు బాగు చేయాలని మున్సిపల్ అధికారులు విన్నవించినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed