అక్రమ గ్రావెల్ తవ్వకాల పై మెరుపుదాడి

by Jakkula.Mamatha |

గ్రామ పరిధిలో అక్రమంగా గ్రావెల్ (మొరం) తవ్వకాలు నిర్వహిస్తున్న ముఠాను శనివారం అరెస్టు చేశారు.

అక్రమ గ్రావెల్ తవ్వకాల పై మెరుపుదాడి
X

దిశ, ములుగు: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ బృందం, ములుగు పోలీసుల సంయుక్త చర్యలో ములుగు మండలం కొక్కొండ గ్రామ పరిధిలో అక్రమంగా గ్రావెల్ (మొరం) తవ్వకాలు నిర్వహిస్తున్న ముఠాను శనివారం అరెస్టు చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వి టిప్పర్ వాహనాల ద్వారా తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మెరుపు దాడిలో మొరం తో నిండిన 6 టిప్పర్ వాహనాలు, తవ్వకాలకు వినియోగిస్తున్న ఒక హిటాచీ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను అక్రమంగా వినియోగించడం, ఖనిజాలు అనుమతులు లేకుండా తరలించడం చట్టరీత్యా నేరమని పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ములుగు ఎస్‌ఐ రఘుపతి హెచ్చరించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story