ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

by Naveena |

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అధికారులను ఆదేశించారు.

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
X

దిశ, సిద్దిపేట అర్బన్ : ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, అబ్దుల్ హమీద్ లతో కలిసి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యయ ప్రయాసలకు ఓర్చి అర్జీదారులు అందించిన సమస్యలను పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ.. సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా వాణి కార్యక్రమానికి మొత్తం 43 అర్జీలు వచ్చినట్లు కలెక్టరేట్ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ నాగ రాజమ్మ, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో రోస్టర్స్ బుక్స్ మెయింటైన్‌ చేయాలి

జిల్లాలో రోస్టర్స్ బుక్స్ మెయింటైన్‌ చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా డెఫ్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ మను చౌదరికి అర్జీ అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు బాసంగారి శ్రీకాంత్ తెలిపిన ప్రకారం... ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాల్లో రోస్టర్ బుక్ లు విభజించక పోవడం వల్ల సిద్దిపేట జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. సిద్దిపేట జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో రోస్టర్స్ బుక్ మెయింటైన్‌ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

Next Story