- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శనగ పంటలో యాజమాన్య పద్ధతులు పాటించాలి : ఏఓ వసంతారావు
by Ratna Kumari |
దిశ, జగదేవపూర్ : శనగ పంట లో వచ్చే ఎండు తెగులు, పచ్చ పురుగు, రబ్బర్ పురుగు నివారణకు నివారణకు సస్యరక్షణ

X
దిశ, జగదేవపూర్ : శనగ పంట లో వచ్చే ఎండు తెగులు, పచ్చ పురుగు, రబ్బర్ పురుగు నివారణకు నివారణకు సస్యరక్షణ చేపట్టినట్లయితే అధిక దిగుబడి పొందవచ్చని మండల వ్యవసాయ అధికారి వసంతారావు, రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త పల్లవి అన్నారు. శనివారం జగదేవపూర్ మండలంలోని అల్లిరాజపేటలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వ్యవసాయ ఎగుమతులు, ఎగుమతి అవకాశాలపై రైతులు రైతు ఉత్పత్తి దారుల సంస్థల కోసం శనగ పంటలు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. రైతులు పండించిన తమ పంటను ప్రాసెసింగ్ చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చని చెప్పారు. రైతులు యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడకుండా తెలంగాణ ప్రభుత్వం యూరియా కోసం తెచ్చిన ప్రత్యేక యాప్ అవగాహన పెంచుకోవాలని సూచించారు.
Next Story






