సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ప్రతీక్ జైన్

by Taduka Kalyani |

సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ గా ప్రతీక్ జైన్ బదిలీపై ఇక్కడికి రానున్నారు. ఈ మేరకు శనివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ప్రతీక్ జైన్
X

దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ గా ప్రతీక్ జైన్ బదిలీపై ఇక్కడికి రానున్నారు. ఈ మేరకు శనివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇప్పటివరకు ఇక్కడ కలెక్టర్ గా పనిచేసిన ప్రావీణ్య ఆర్ అండ్ బి స్పెషల్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. 2017 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి ప్రతీక్ జైన్ ప్రస్తుతం నారాయణపేట జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ తాజాగా బదిలీపై సంగారెడ్డి జిల్లాకు రాబోతున్నారు. అయితే రానున్న జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నేపథ్యంలోనే రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది.

Next Story