- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి : కలెక్టర్ రాహుల్ రాజ్
గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.

దిశ, రేగోడ్ : గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం మండల కేంద్రమైన రేగోడ్ లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కి కలెక్టర్ పాల్గొని నేరుగా అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక నుంచి జిల్లా స్థాయి అధికారిని నోడల్ అధికారిగా ప్రజావాణిలో పాల్గొంటారని చెప్పారు. అలాగే ప్రజల నుంచి వచ్చిన సమస్యల అర్జీలను ఆన్ లైన్లో కూడా ఎంట్రీ చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం తమకు వచ్చిన అర్జీలను మండల, జిల్లా స్థాయి అధికారులకు పంపించి 30 రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు దూర భారం కావద్దనే ఉద్దేశంతో అందుబాటులోకి ప్రజావాణిని తీసుకువచ్చామన్నారు. రేగో డ్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని వచ్చిన వినతులను ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. ఎక్కువగా వచ్చిన భూ సమస్యల అర్జీలను పరిశీలించి ఒక వారంలోగా పరిష్కరిస్తామని చెప్పారు. ప్రజలు ఇచ్చే అర్జీలను పరిశీలించి వాటి పరిష్కార మార్గాల గురించి స్పష్టంగా వారికి తెలియజేయాలని ఆదేశించారు. మండల స్థాయిలో జరిగే ప్రజావాణి సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇన్ చార్జి ఎంపీడీఓ స్థానంలో రెగ్యులర్ ఎంపీడీఓను నియమించాలని సర్పంచ్ పర్వీన్ సుల్తానా కలెక్టర్ ను కోరారు. బస్సు సౌకర్యం, వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీలను సమర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సీతారావమ్మ, తహశీల్దార్ దత్తారెడ్డి, ఏవో రాంప్రసాద్, ఎంఈవో గురునాథ్, ఎస్సై పోచయ్య, పీసీసీ సభ్యుడు కిషన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దిగంబర రావ్ పాల్గొన్నారు.






