బెల్ట్ షాపుపై పోలీసుల దాడి..కేసు న‌మోదు

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, న్యాల్క‌ల్ : న్యాల్కల్ మండలంలోని మీర్జాపూర్ (N) గ్రామంలో అక్రమ మద్యం అమ్మడంపై పోలీసులు దాడులు నిర్వహించారు. గ్రామంలో కిరాణా వ్యాపారి తెలుగు అంజన్న తన దుకాణంలో

బెల్ట్ షాపుపై పోలీసుల దాడి..కేసు న‌మోదు
X

దిశ‌, న్యాల్క‌ల్ : న్యాల్కల్ మండలంలోని మీర్జాపూర్ (N) గ్రామంలో అక్రమ మద్యం అమ్మడంపై పోలీసులు దాడులు నిర్వహించారు. గ్రామంలో కిరాణా వ్యాపారి తెలుగు అంజన్న తన దుకాణంలో చట్టవిరుద్ధంగా మద్యం విక్రయిస్తూ, అధిక ధరలకు అమ్ముతున్నాడనే విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం సాయంత్రం హద్నూర్ పోలీసులు ఆకస్మిక దాడులు చేపట్టారు. ఈ దాడిలో మొత్తం 20 మద్యం బాటిళ్ల‌ను స్వాధీనం చేశామని పోలీసులు తెలిపారు. వీటిలో ఇంపీరియల్ బ్లూ 4 బాటిల్స్, ఆఫీసర్ ఛాయిస్ 8 బాటిల్స్, డీకే బ్రాండ్ కి చెందిన మరో 8 బాటిల్స్ ఉన్నట్లు ఎస్ఐ సుజిత్ వివరించారు. అక్రమ మద్యం విక్రయానికి పాల్పడిన దుకాణ యాజమాని అంజన్న పై కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story