- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నూతన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి: ఏసీపీ రవీందర్ రెడ్డి
ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలని, పోలీసులు ప్రజల్లో తిరిగినప్పుడే అభద్రతాభావం పోతుందని ఏసీపీ రవీందర్ రెడ్డి అన్నారు.

దిశ చిన్నకోడూరు: ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలని, పోలీసులు ప్రజల్లో తిరిగినప్పుడే అభద్రతాభావం పోతుందని ఏసీపీ రవీందర్ రెడ్డి అన్నారు. శనివారం రాత్రి మండల కేంద్రంలో ప్రజలతో ముఖాముఖి ప్రోగ్రాం నిర్వహించారు. డాగ్ స్క్వాళ్లతో తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ప్రజలతో స్నేహ పూరిత సంబంధాలు కలిగి ఉండాలన్నారు. ప్రజలకు ప్రభుత్వాలు తెచ్చిన కొత్త చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. చట్టాలపై అవగాహన కలిగినప్పుడే ప్రజలు నేరాలకు పాల్పడారని తెలిపారు. పోలీసులు ప్రజల్లో తిరిగినప్పుడే పట్టణ, గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు ఎవరు వస్తున్నరనేది తెలుస్తుందన్నారు.
మీ పరిసర ప్రాంతాల్లో అనుమాన స్పదమైన వ్యక్తులు సంచరించిన, అద్దెకు దిగిన పోలీసులకు సమాచారం అందించాలన్నారు. యువత మత్తు పదార్థాలు ఆన్లైన్ గేములు వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. దేశ భవిష్యత్తుకు యువతే పునాది అన్నారు ప్రజలు సైబర్ నేరల పట్ల జాగ్రత్త గా ఉండాలన్నారు. ఎవరైనా సైబర్ నేరస్తుల బారిన పడితే వెంటనే 1930 నెంబర్‌కు డయల్ చేయాలన్నారు. ఈ సందర్భంగా 15 బీర్లు,25 ఎలాంటి పేపర్లు లేని మోటార్ సైకిళ్లను స్వాధీనపరుచుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ శీను, ఎస్సైలు బాలకృష్ణ, అపూర్వ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






