- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: హరీష్ రావు
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు.

దిశ, సిద్దిపేట ప్రతినిధి: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో వరద ముంపు గురైన లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు. మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత 20 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా వర్షం పడిన నేపథ్యంలో నర్సాపూర్ చెరువు మత్తడిని ఒక మీటర్ మేర తొలగించి శనిగరం, మందపల్లి వైపు వరద నీటిని మళ్లించినట్లు వెల్లడించారు. వరద ప్రభావానికి పట్టణం గురి కాకుండా మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. సెట్ బ్యాక్ తో ప్రభుత్వ నిబంధనల మేరకు ఇంటి నిర్మాణాలు చేపట్టాలని ప్రజలకు సూచించారు. హరీష్ రావు వెంట బీఆర్ఎస్ నాయకులు కడవేర్గు రాజనర్సు, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, పాల సాయిరాం, అక్తర్ పటేల్, అరవింద్ రెడ్డి తదితరులున్నారు.






