- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, ఝరాసంగం: అక్రమంగా బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ఘటన జహీరాబాద్ డివిజన్ పరిధిలో జరిగింది. డీఎస్పీ శంకర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం తో మడిగి గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా హైదరాబాద్ వైపు నుండి గుజరాత్ వైపు వెళుతున్న వాహనం GJ-36V-9963 నెంబర్ గల లారీ అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీలు చేశారు. ఇందులో పిడిఎస్ బియ్యాన్ని 815 ప్లాస్టిక్ బ్యాగులో 312 క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించారు. దీంతో బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీ యజమాని, డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ కాశీనాథ్, సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు.
Next Story






