పిల్లల చదువులకు తల్లిదండ్రుల కష్టాలు.!

by Ajay Maddhiboyina |

విద్యా సంవత్సరం మొదలవుతుందనగానే విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలుగుతోంది. ఉమ్మడి తూప్రాన్ మనోహరబాద్ మండల్లో సుమారు 20 వరకు ప్రైవేట్ పాఠశాలలు ఉండగా పాఠశాలల్లో ఫీజులు గుర్తు చేసుకుంటే భయం వేస్తోంది.

పిల్లల చదువులకు తల్లిదండ్రుల కష్టాలు.!
X

దిశ, తూప్రాన్: విద్యా సంవత్సరం మొదలవుతుందనగానే విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలుగుతోంది. ఉమ్మడి తూప్రాన్ మనోహరబాద్ మండల్లో సుమారు 20 వరకు ప్రైవేట్ పాఠశాలలు ఉండగా పాఠశాలల్లో ఫీజులు గుర్తు చేసుకుంటే భయం వేస్తోంది. ప్రతి ఏటా ఒక పద్ధతి విధానమంటూ లేకుండా ఫీజులు పెంచుతున్న పాఠశాలలు ఉన్నాయి. దీంతో సామాన్య ప్రజలకు ప్రైవేటు విద్య భారంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా మరో ఐదు రోజుల్లో పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి కాబట్టి ఇప్పటి నుండే ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు అడ్మిషన్ల పేరుతో బిజీగా ఉన్నారు. అటు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికల కోసం బడిబాట కార్యక్రమం ప్రారంభించారు. ఆలోపే వీలైనంత ఎక్కువగా అడ్మిషన్లు సేకరించాలని లక్ష్యంతో ప్రైవేటు యాజమాన్యాలు పరుగులు తీస్తున్నారు. పాఠశాలల పునః ప్రారంభమయ్యే నాటికి సరిపడా విద్యార్థులను నింపుకునే పనిలో నిమగ్నమయ్యాయి.అడ్మిషన్ టెస్ట్ పెడితే విద్యార్థులను చేర్చుకునే పనిలో ఉన్నారు ఇందులో భాగంగా ముందస్తుగా పుస్తకాలు, యూనిఫాం, తదితర వస్తువులను కానుండగా ఇప్పటినుంచే తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం ఆలోచనలో పడ్డారు.

తక్కువ వేతనం తీసుకునే టీచర్లు..

ఎక్కడ డీఎడ్, బీఎడ్ చదివి సర్టిఫకెట్ పొందిన వారిని ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులుగా బోధన చేస్తారో వారికి వేతనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వారిని తీసుకోకుండా పదవ తరగతి, ఇంటర్మీడియట్ చదివి ఇంటిదగ్గర కాలక్షేపం చేసుకునే వారిపై ప్రైవేట్ యాజమాన్యం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఎందుకంటే వారికి వేతనం ఎంత ఇచ్చినా తీసుకుంటారనే యజామన్యం నియమించుకుంటుంది. కానీ విద్యార్థుల నుంచి ఫీజులు అధిక మోతాదులో వసూలు చేస్తూ, సరైన విద్యాబోధన అందించడం లేదని, ఇప్పటికైనా ప్రైవేట్ పాఠశాలలో క్వాలిఫై టీచర్లను తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు అభిప్రాయ పడుతున్నారు.

సామాన్యులకు భారంగా

విద్యార్థుల తల్లిదండ్రుల అవసరాన్ని అవకాశంగా మల్చుకుంటున్న కొన్ని పాఠశాల యజమాన్యాలు ఇస్టారీతిన అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వపరంగా ఎలాంటి అజమాయీషి లేకపోవడంతో యాజమాన్యాలు ఆడింది ఆటగా సాగుతోంది ఇంగ్లీషు మీడియంలో ఎల్కేజీ అభ్యసించే విద్యార్థికి సంవత్సరానికి కనీసం రూ.20వేల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో పాటు వెళ్ళాలో అడ్మిషన్ ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం, బెల్టు తమ పాఠశాలల పేరే ఉండాలని నిబంధన ఉండటంతో తల్లిదండ్రులు ఎక్కువైనా కొనక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.మధ్యతరగతి కుటుంబంలో ఇద్దరు పాఠశాలకు వెళ్లే పిల్లలు ఉండడంతో రూ.15వేల నుంచి 20వేల వరకు నెలసరి ఆదాయంతో సతమతమవుతూ ఉన్న తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్నారు. దీనిపై విద్యాధికారులు పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story