- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రామ సమైక్య సంఘాలకు సొంత భవనాలు
దిశ, నారాయణఖేడ్ : నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలలో గల గ్రామ సమైక్య సంఘాలకు సొంత భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు.

దిశ, నారాయణఖేడ్ : నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలలో గల గ్రామ సమైక్య సంఘాలకు సొంత భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి.. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కలు రాష్ట్రంలోని అన్ని గ్రామ సమైక్య సంఘాలకు సొంత భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తున్నారు నియోజకవర్గ పరిధిలో ఖేడ్ లో 33, మనూర్ లో 21, నాగల్గిద్దాలో 17, సిర్గాపూర్ లో 17, పెద్దశంకరంపేట్ లో 10, కంగ్టిలో 28, కల్లేర్ లో 17 మొత్తం 143 భవనాలు నిర్మించునున్నట్టు తెలిపారు. ఒక్కొక్క భవనానికి 10లక్షలు, మరుగుదొడ్ల నిర్మాణానికి మరో 2లక్షల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది అన్నారు. ఖర్చు పెరిగితే ఎమ్మెల్యే కోట కింద లేదా కొనుగోలు కేంద్రాల వద్ద గల కమిషన్ డబ్బులు వెచ్చించి భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. నూతన సర్పంచులు భవనాల నిర్మాణాలకు తీర్మానం చేయించాలని, గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అన్నారు. భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని ఒకవేళ ప్రభుత్వ స్థలం లేకపోతే నిరూపయోగంగా ఉన్నటువంటి పల్లె ప్రకృతి వనాలు లేదా క్రీడాప్రాంగాణాల స్థలంలో భవనాలు నిర్మించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ తాజా మాజీ వైస్ దారం శంకర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాహెర్, నాయకులు యాదవరెడ్డి, రహీం, హన్మండ్లు, డానియల్, ఆయా మండలాల ఏపిఎంలు, ఐకెపి ఉద్యోగులు పాల్గొన్నారు.






