- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం
by Taduka Kalyani |
పటాన్ చెరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శనివారం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి జైరామ్ నాయక్ తెలిపారు.

X
దిశ, పటాన్ చెరు టౌన్ : పటాన్ చెరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శనివారం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి జైరామ్ నాయక్ తెలిపారు. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు ఈ నెల ఆరు తేదీ నుంచి నుంచి 17 వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తులను http://wdcw.tg.nic.in వెబ్‌సైట్ ద్వారా సమర్పించాలని ఒక ప్రకటనలో తెలిపారు. నియామకాలకు సంబంధించిన అర్హతలు, నిబంధనలు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని,గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను స్వీకరించబోమని పేర్కొన్నారు.
Next Story






