- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లవర్ తో నామినేషన్..ఆ తరువాత ఊహించని ట్విస్ట్..!
దిశ, సంగారెడ్డి : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. తాను ఉంటున్న గ్రామపంచాయతీ లో ఎస్సీ మహిళ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కావడంతో బీసీ

దిశ, సంగారెడ్డి : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. తాను ఉంటున్న గ్రామపంచాయతీ లో ఎస్సీ మహిళ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కావడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఏకంగా తన లవర్ తో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయించాడు. ఈ సంఘటన సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. తాళ్లపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ బీసీ కమ్యూనిటీకి చెందిన యువకుడు. అయితే అతడు అదే గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శ్రీజ అనే యువతితో ప్రేమలో పడ్డాడు. తాజాగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆ గ్రామానికి ఎస్సీ మహిళ రిజర్వేషన్ రావడంతో చంద్రశేఖర్ గౌడ్ ఆ అమ్మాయి పేరు మీద నామినేషన్ వేశాడు. ఆ తర్వాత ఈ పంచాయతీ కాస్త పెద్దల దాకా వెళ్లడంతో వారిద్దరు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే యువతి కుటుంబ సభ్యులు సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ లో తమ అమ్మాయి కనిపించడం లేదంటూ ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే ఇద్దరూ మేజర్లు కావడంతో పెళ్లి చేసుకున్న తమకు రక్షణ కల్పించాలంటూ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించారు. తన లవర్ తో వేయించిన నామినేషన్ ను ఉపసంహరించుకునేలా అవతల వ్యక్తులు వీరికి ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన కాస్త బయటికి రావడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి చేసుకొని ఒకటైన ప్రేమ జంటకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వారికి తన మద్దతును అందజేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా తనను గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి పూర్తి సహకారం చేస్తానని, ఎవరు కూడా తమకు ఇబ్బందులు గురి చేయొద్దని పెళ్లి చేసుకున్న కొత్తజంట ఇద్దరు మీడియా ముఖంగా వేడుకున్నారు.






