- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేగుంటలో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు సంబురాలు..
దుబ్బాక ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్ రెడ్డి గెలవడంతో చేగుంట మండల కేంద్రంలో సంబురాలు అంబరాన్ని అంటాయి.

దిశ, చేగుంట : దుబ్బాక ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్ రెడ్డి గెలవడంతో చేగుంట మండల కేంద్రంలో సంబురాలు అంబరాన్ని అంటాయి. మండల కేంద్రమైన చేగుంటలోని గాంధీ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పట్టణశాఖ అధ్యక్షుడు ఎర్ర యాదగిరి ఆధ్వర్యంలో పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. గాంధీ చౌరస్తా వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దుబ్బాక ఎమ్మెల్యేగా కొత్తప్రభాకర్ రెడ్డి 53,000 మెజారిటీతో గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు జరుపుకున్నారు. అనంతరం కార్యకర్తలకు మిఠాయిలు పంచి పెడుతూ జై కేటీఆర్ జై జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు. ఈ సంబురాల కార్యక్రమంలో టెలికాంబోర్డు సభ్యుడు సోమ సత్యనారాయణ, చేగుంట సొసైటీ డైరెక్టర్ సిద్ధిరాములు వైశ్య సంఘం నాయకుడు అయితా పరంజ్యోతి, కుర లక్ష్మీనారాయణ, జర్నల్ సింగ్, శ్రీనివాస్, రాజేష్, వెంకటేష్, నరేష్, రవితో పాటు కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.






