- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొమురవెల్లి సత్రం పై నిర్లక్ష్యం..!
కొమురవెల్లిలోని బండగుట్టపై భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న 50 గదుల వసతిసత్రం పనులు పంచాయతీరాజ్ అధికారుల నిర్లక్ష్యం,

- మల్లన్న కల్యాణం వరకైనా అందుబాటులోకి వచ్చేనా..?
- 7 ఏళ్లుగా కొనసాగుతున్న 50 గదుల కాటేజీ పనులు
- అధికారుల పర్యవేక్షణ లోపంతోని నత్తనడకన నిర్మాణం
- పంచాయతీరాజ్ అధికారి పేరిట చెక్కులు ఇచ్చినా ఫలితం శూన్యం
- దేవస్థానం, ఎస్డీఎఫ్ నిధులతో రూ.14 కోట్లతో కాంట్రాక్ట్
- అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్వామివారి భక్తులు
దిశ, కొమురవెల్లి: కొమురవెల్లిలోని బండగుట్టపై భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న 50 గదుల వసతిసత్రం పనులు పంచాయతీరాజ్ అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణలోపంతో ఏడేళ్లుగా నత్తనడకన కొనసాగి తుదిదశకు చేరుకున్నాయి. 2018లో ప్రారంభమైననిర్మాణ పనులు, రెండు సంవత్సరాల కాలపరిమితిలో పూర్తి చేయాల్సి ఉండగా, ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడం పంచాయతీరాజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వచ్చే డిసెంబర్లో నిర్వహించే మల్లన్న కల్యాణ ఉత్సవాలకైనా, కాటేజీ పూర్తవుతుందా లేదా అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
14కోట్ల రూపాయలతో నిర్మాణం..
మల్లన్న దేవాలయం, పంచాయతీరాజ్ స్పెషల్ ఫండ్ ఎస్డీఎఫ్ నుంచి సంయుక్తంగా మొత్తం 14కోట్ల రూపాయలతో నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. దేవాలయం నుంచి ఘాట్ రోడ్డుకు రూ.4 కోట్ల15 లక్షలు, చౌల్ట్రీ నిర్మాణానికి మరో రూ.3కోట్ల40 లక్షలు, పంచాయతీరాజ్ ఎస్డీఎఫ్ నుంచి రూ.6కోట్ల 80లక్షలతో కలిపి మొత్తం14 కోట్ల సంయుక్త నిధులతో 50గదుల కాటేజీలు నిర్మించేందుకు 2018లో పనులు ప్రారంభించారు. అయితే పనుల నిర్వహణ బాధ్యత పూర్తిగా పంచాయతీరాజ్ శాఖ ఆధీనంలోకి వెళ్లింది. టెండర్ నిబంధనల ప్రకారం రెండు సంవత్సరాల కాలపరిమితిలో పూర్తి చేయాలని, లేనియెడల సదరు కాంట్రాక్టు గడువు పొడిగించాల్సి ఉండగా, నిబంధనలు పట్టించుకోకుండా పీఆర్ అధికారులు కాంట్రాక్టర్ కు వత్తాసు పలుకుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ వ్యవహార శైలితో విసుగు చెందిన దేవాలయ అధికారులు, కేవలం 10శాతం పనులు మాత్రమే బాకీ ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకొని, ఈ పనిని పంచాయతీరాజ్ అధికారులతో పనులు చేయించేందుకు నిర్ణయించుకొని, ఈ మేరకు మిగిలిన ఎలక్ట్రిషన్, ప్లంబింగ్, గ్రిల్స్, గ్లాస్, ఫర్నిచర్ కొనుగోలు నిమిత్తం సదరు కాంట్రాక్టర్కు ఇవ్వాల్సిన రూపాయలలో 50 లక్షలరూపాయల చెక్కులను ఇటీవల పీఆర్ డీఈ పేరిట ఇచ్చిన పనుల్లో పురోగతి సాధించడం లేదు. అయితే అదనపునిధుల కోసం పంచాయతీరాజ్ అధికారులకు కాంట్రాక్టర్ ప్రతిపాదనలు పంపాడు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి త్వరగా పనులు పూర్తచేసి భవనం అందుబాటులోకి తేవాలని భక్తులు స్థానికులు మండిపడుతున్నారు.
డిసెంబర్ లో మల్లన్న కళ్యాణం:
మల్లన్న క్షేత్రంలో బండగుట్టపై నిర్మిస్తున్న 50కాటేజీలు డిసెంబర్లో జరిగే మల్లన్న కల్యాణం జాతర బ్రమ్మోత్సవాల వరకైనా అందుబాటులోకి వస్తుందా లేదా అని భక్తులు ఆగ్రహంతో ఉన్నారు. బండగుట్ట (కొండపైన )ఆత్యాధునిక హంగులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మిస్తున్న ఈ భవనం అందుబాటులోకి వస్తే, గదుల కొరత కొంతమేరకు తగ్గి సామాన్య భక్తులకు తిప్పలు తప్పనున్నట్లు భక్తులు,స్థానికులు ఆశభావం వ్యక్తం చేస్తున్నారు.
కల్యాణం వరకూ అందుబాలుటులోకి..
50గదుల సత్రం నిర్మాణ పనులపై అధికారులతో రివ్యూ నిర్వహించాం. డిసెంబర్లో జరిగే మల్లన్న కళ్యాణ వరకు దేవాలయానికి అప్పగించాలని కాంట్రాక్టర్ కు ఆదేశాలు జారీచేశాం. పనులు పూర్తయిన తర్వాత పూర్తి డబ్బు చెల్లిస్తాం.
టీ.వెంకటేష్, మల్లన్న ఆలయ ఈవో






