- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాదకద్రవ్యాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ కే. హైమావతి
మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కే. హైమావతి సూచించారు.

దిశ, మిరుదొడ్డి : మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కే. హైమావతి సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజుల కార్యాచరణలో భాగంగా మిరుదొడ్డి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో మిషన్ వాత్సల్య పథకం పై విద్యార్థినిలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ కే హైమావతి హాజరై మాట్లాడుతూ కిశోర వయసు అనేది మంచి, చెడు తెలియని వయస్సు అని, ఎవరు చెప్పింది నమ్మాలి, సమాజంలో ఎలా మెలగాలి, భద్రత సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలో వివరించారు. మహనీయుల అడుగుజాడల్లో నడిచి, మంచి చదువు చదివి ఎంచుకున్న రంగాల్లో ఉన్నతంగా ఎదగాలని తెలిపారు. చదువులో ఫెయిల్ అయితే జీవితంలో ఓడినట్లు కాదని, చిన్న చిన్న సమస్యలకు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దని ప్రేమలు, సోషల్ మీడియా జోలికి వెళ్లకుండా నిరాశ పడకుండా వృద్ధిలోకి రావాలని సూచించారు. ఇతరులకు ఆదర్శంగా నిలిచే విధంగా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి శారద, డీఆర్డిఓ జయదేవ్ ఆర్య, సీడీపీఓ రాము, ఏంఈఓ ప్రవీణ్ బాబు, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్, అధ్యాపకులు, స్నేహ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






