నంగునూరు చరిత్ర పుస్త‌కావిష్క‌ర‌ణ

by Ratna Kumari |

నంగనూరు గ్రామానికి చెందిన రచయిత కొలిపాక శ్రీనివాస్ నంగునూరు కు సంబంధించిన చారిత్రక విశేషాలపై పరిశోధించి రచించిన "నంగునూరు చరిత్ర" పుస్తక ప్రతులను నంగునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు బహుకరించారు. ఈ

నంగునూరు చరిత్ర పుస్త‌కావిష్క‌ర‌ణ
X

దిశ, నంగునూరు : నంగనూరు గ్రామానికి చెందిన రచయిత కొలిపాక శ్రీనివాస్ నంగునూరు కు సంబంధించిన చారిత్రక విశేషాలపై పరిశోధించి రచించిన "నంగునూరు చరిత్ర" పుస్తక ప్రతులను నంగునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు బహుకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామస్వామి మాట్లాడుతూ గ్రామానికి చెందిన కొలిపాక శ్రీనివాస్ తెలంగాణ చారిత్రక బృందం సభ్యులుగా తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో సంచరించి అనేక చారిత్రక విషయాలను బయటకు తీశారని, ఇది చాలా గర్వకారణమైన విషయం అని అన్నారు. కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ చరిత్రపై విద్యార్థులకు అవగాహన పెరగాలని, చరిత్ర తెలుసుకుంటూనే భవిష్యత్తు నిర్మించుకోవాలని తెలిపారు. తాను స్వతహాగా ఉన్న ఆసక్తితో అనేక ప్రాంతాలలో ఉన్న చారిత్రక విషయాలను తెలుసుకుంటూ, కొత్త చరిత్ర విషయాలను బయటకి వెలికి తీస్తున్నారని తెలిపారు. చారిత్రక పూర్వ యుగం కాలం నాటి రాతి పరికరాలు, టేర్రకోట బొమ్మలు, వర్తమాన మహావీర విగ్రహం, ఆదిమానవుల సమాధులు, యుద్ధ వీరుల విగ్రహాలు లాంటి అనేక చారిత్రక విషయాలను పరిశోధించడం జరిగిందని తెలిపారు. పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు వై.రాంగోపాల్ రెడ్డి, కొత్తపల్లి రవి, ఉపాధ్యాయులు డి.రవీందర్ రెడ్డి, తిరుపతి, నగేష్, రాజమౌళ, రాజు, సుశీల, నాగలక్ష్మి పాల్గొన్నారు.

Next Story