- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సౌదీలో రోడ్డు ప్రమాదం..!
దిశ, మెదక్ ప్రతినిధి : సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విషాదం చోటు చేసుకుంది. మెదక్ పట్టణం నవాబ్ పేటకు చెందిన నంగి వెంకట్(35) సోమవారం రాత్రి మృతి చెందాడు. మెదక్ పట్టణం

దిశ, మెదక్ ప్రతినిధి : సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విషాదం చోటు చేసుకుంది. మెదక్ పట్టణం నవాబ్ పేటకు చెందిన నంగి వెంకట్(35) సోమవారం రాత్రి మృతి చెందాడు. మెదక్ పట్టణం నవాబ్ పేటకు చెందిన నంగి వెంకట్(35) ఏడాది క్రితం ఉపాధి కోసం సౌదీ వెళ్ళాడు. అక్కడే డ్రైవర్ గా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. డ్రైవర్ విధుల్లో భాగంగా వాహనం లో వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వేరే వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వెంకట్ సౌదీలో మృతి చెందాడు. వెంకట్ మృతి చెందిన విషయం స్థానిక వార్డు మాజీ కౌన్సిలర్ లక్ష్మీ ముత్యం గౌడ్ మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ దృష్టికి తీసుకు వెళ్ళారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అక్కడి కంపెనీ యజమాని సలీం తో ఫోన్ లో మాట్లాడారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెంకట్ మృతదేహం త్వరగా పంపించే ఏర్పాట్లు చేయాలని కోరారు. మృతుడు వెంకట్ కుభార్య ఎల్లమ్మ ఇద్దరు పిల్లలు ఉన్నారు. త్వరగా మృతదేహం తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.






