- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి రాజీవ్ చౌరస్తా వరకు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ విభజనపై మోడీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అన్నారు. బిజెపి పార్టీ తెలంగాణకు పూర్తిగా వ్యతిరేకంగా పని చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో బయ్యారం ఫ్యాక్టరీ రాకుండా అడ్డుకున్నారని తెలిపారు. విభజన ఒప్పందాల ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించాల్సి ఉన్నప్పటికీ కేంద్రం ఇప్పటికీ ఇవ్వలేదని దుయ్యబట్టారు. తెలంగాణలో ఉండాల్సిన 7 మండలాలు అక్రమంగా ఆంధ్రాలో కలిపారని తెలిపారు. నీతి ఆయోగ్ తెలంగాణకు 27 వేల కోట్లు ఇవ్వాలని చెప్పినప్పటికీ కేంద్రం ఇవ్వలేదని విమర్శించారు. హైదరాబాద్‌కు రావాల్సిన ఐటిఐఆర్ ప్రాజెక్టును సైతం కేంద్రం అడ్డుకుందని మండిపడ్డారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం కేవలం ఎన్నికల కోసమే జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. రైతుబంధు, మిషన్ భగీరథ పథకాలను కేంద్రం తెలంగాణ నుండి కాపీ కొట్టిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ నాయకులు పరమేష్, రవీందర్ నాయక్, రమేష్ చౌహాన్, సత్యపాల్ రెడ్డి, విజయ్ బుజ్జి, ముజమ్మిల్, భూపాల్, తదితరులు పాల్గొన్నారు.






