- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎవరి కన్నబిడ్డనో.. తప్పిపోయిన 5 ఏండ్ల బాలుడు
గత 3 రోజులుగా అమ్మా నాన్నను నుంచి దూరమై ఓ బాలుడు తప్పిపోయాడు.

దిశ, పటాన్ చెరు టౌన్ : గత 3 రోజులుగా అమ్మా నాన్నను నుంచి దూరమై ఓ బాలుడు తప్పిపోయాడు. ఈ సంఘటన ఇంద్రేశం పరిధిలోని రామేశ్వరం బండలో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాలుడు పటాన్ చెరు పోలీస్ స్టేషన్ సంరక్షణలో ఉన్నాడు. వివరాల్లోకి వెళితే ఇంద్రేశం పరిధిలోని రామేశ్వరం బండ ప్రాంతంలోని నవ్య వెంచర్ కన్-స్ట్రక్షన్స్ సమీపంలో తేదీ 25-4-2026 రోజున మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సుమారు ఐదేళ్ల అబ్బాయి ఒంటరిగా తిరుగుతూ కనిపించాడు. అక్కడే వాచ్మెన్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ గమనించి బాబుని తన వద్దే ఉంచుకున్నాడు. బాబు తరపున బంధువులెవరూ రాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు పోలీసులు బాబుని వివరాలు అడగగా పేరు గౌతమ్, నివాసం రామేశ్వరం బండ అని మాత్రమే చెప్పినట్టు తెలిపారు. బాలుడి ఆచూకీని ఎవరైనా గుర్తించినట్టయితే వెంటనే పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో తెలియపర్చాలని, లేదా ఎస్.హెచ్.ఓ 8712656724, 8712583468, 8712661839 నెంబర్లకు సమాచారం ఇవ్వాల్సిందిగా పోలీసులు విజ్ఞప్తి చేశారు.






