గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: మంత్రి పొన్నం

by Bhanu |

పంచాయితీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. పార్టీ ముఖ్య నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: మంత్రి పొన్నం
X

దిశ, హుస్నాబాద్: పంచాయితీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా పార్టీ ముఖ్య నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల గెలుపు కోసం దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పార్టీ మద్దతుదారులను గెలిపించేందుకు ప్రతి గ్రామంలో ఉన్న నాయకులు ఏకమై పని చేయాలని సూచించారు. అంతర్గత విభేదాలకు తావు ఇవ్వకుండా, సమస్యలను స్థానికంగా పరిష్కరించుకునే బాధ్యత పార్టీ శ్రేణులదేనని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులను 100 శాతం గెలిపించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని, వారికి మద్దతు ఇస్తూ ప్రచారం నిర్వహించడం ప్రతి నాయకుడి బాధ్యత అని స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో బూత్ కమిటీలు బలోపేతం చేసి, అభ్యర్థుల అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు చేరవేయాలన్నారు. ఈ సమావేశంలో వివిధ మండలాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సమన్వయకర్తలు పాల్గొన్నారు.

Next Story