బొమ్మ వెంకన్న ఆశయాలను కొనసాగిద్దాం: మంత్రి పొన్నం ప్రభాకర్

by Bhanu |

ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని నాగారం చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు నివాళులర్పించారు.

బొమ్మ వెంకన్న ఆశయాలను కొనసాగిద్దాం: మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ, హుస్నాబాద్: ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని నాగారం చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు నివాళులర్పించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడే బొమ్మ వెంకన్న బలహీన వర్గాల కోసం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం నాకు మార్గదర్శకం అయింది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి అపారమైనది అని అన్నారు.వై ఎస్.రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో ప్రజల ఆకాంక్షగా గౌరవెల్లి ప్రాజెక్ట్ సాధన కోసం శ్రమించిన నాయకుల్లో బొమ్మ వెంకన్న ఒకరని మంత్రి పొన్నం పేర్కొన్నారు.

అనేక సందర్భాల్లో తాను రాజకీయంగా ఎదగడానికి ఆయన ఇచ్చిన మార్గనిర్దేశనం ఎంతో సహాయపడిందని తెలిపారు. బొమ్మ వెంకన్న ఆశయాలను కొనసాగించడం తన బాధ్యత అని మంత్రి పొన్నం తెలిపారు. ఈ ప్రాంత రైతాంగం అభివృద్ధి, పురోగతికి ప్రభుత్వం అండగా ఉంటుందని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌస్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, సింగిల్విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, డిసిసి కార్యదర్శి చిత్తారి రవీందర్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, నాయకులు ఎండి హసన్, పెరుమాండ్ల నర్సా గౌడ్, మైదంశెట్టి వీరన్న, పున్నసది, వల్లపు రాజు, పచ్చిమట్ల రాధా, భూక్య సరోజన లక్ష్మి, నాయిని రజిత, కోమటీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Next Story