- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు’: మంత్రి గడ్డం వివేక్
ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొని ప్రారంభించారు.

దిశ, నర్సాపూర్: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయమని, కాంగ్రెస్ ప్రభుత్వ ఐదు సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలకు 17 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం అని మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం నర్సాపూర్ మున్సిపాలిటీలో 6 ,5 వార్డులలోనూతనంగా నిర్మించిన రెండు ఇందిరమ్మ ఇండ్లను మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్ ప్రతిమ సింగ్ ,గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి ,మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్ లతొ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని ప్రస్తుతం కొన్ని ఇండ్లు పూర్తి అయి ప్రారంభించడం జరిగిందని, మరికొన్ని ఇండ్లు వివిధ దశల్లో పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.
బుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు..
వచ్చే సంవత్సరం మరో 2500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లను 100% పూర్తి చేసే విధంగా అధికారులు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. అర్హత ఉండి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి కాంగ్రెస్ నాయకులు అండగా నిలిచి ఇల్లు నిర్మించుకునే విధంగా కృషి చేయాలని సూచించారు. బిఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాల కాలంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని మోసం చేసిందన్నారు. అదేవిధంగా నర్సాపూర్ మున్సిపాలిటీ లో 15 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తో కలిసి అభివృద్ధి పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు సేవాభావంతో పనిచేయాలని అన్నారు. నర్సాపూర్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేసి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు సూచించారు.
పేదింటి ఆడపిల్లల పాలిట వరం..
మున్సిపాలిటీ అభివృద్ధికి 15 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. వేసవికాలంలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా మున్సిపల్ పాలకవర్గం చైర్మన్ ,వైస్ చైర్మన్, కౌన్సిలర్లు ప్రతిరోజు సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆయన అన్నారు. మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ప్రజలతో నిత్యం ఉంటూ ఉదయం, సాయంత్రం సమయం కేటాయిస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. అనంతరం నర్సాపూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేదింటి ఆడపిల్లల పాలిట వరం అన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న వారికి బిల్లుల సమస్యలపై తొందరలో ప్రత్యేక సమావేశం ద్వారా చర్యలు చేపడతామన్నారు. ప్రజలందరూ సన్న బియ్యంతో భోజనం చేయాలని ఉద్దేశంతో 9,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ పథకాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. సన్న వడ్లు పండించిన వారికి 500 రూపాయల బోనస్ మంజూరు చేయడంతో పాటు రైతు రుణమాఫీ పథకం ద్వారా వారికి ఆర్థిక చేయూతన అందిస్తున్నామన్నారు.
ప్రస్తుత రోజుల్లో అమ్మాయిలు బాగా చదువుకుని..
అలాగే ఆర్టీసీ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కోసం 9 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో వారి డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. ఈ సందర్భంగా నర్సాపూర్ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక చేయూత కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం అని అన్నారు ప్రస్తుత రోజుల్లో అమ్మాయిలు బాగా చదువుకుని అన్ని రంగాలు రాణిస్తున్నారని చెప్పారు. ఈ పథకాన్ని నర్సాపూర్ నియోజకవర్గంలో పటిష్టంగా అమలు పరచాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డిఓ రమాదేవి మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ రాజు యాదవ్ , గ్రంధాలయ చైర్మన్ చిలుముల సుహాసినిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్లు, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజి రెడ్డి, డిసిసి అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, సంబంధిత ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.






