- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మలేరియా నిర్మూలనకు అందరూ జాగ్రత్తలు పాటించాలి
by velandi.Saikiran |
మలేరియా వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా తగు జాగ్రత్తలన్నీ పాటించాలని వైద్యాధికారి శ్వేత కోరారు. బుధవారం =

X
దిశ, రేగోడ్: మలేరియా వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా తగు జాగ్రత్తలన్నీ పాటించాలని వైద్యాధికారి శ్వేత కోరారు. బుధవారం నాడు ప్రపంచ దోమల దినోత్సవ కార్యక్రమాన్ని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించి ఆమె మాట్లాడారు. దోమల వల్ల మలేరియా తదితర వ్యాధులు వ్యాపిస్తాయని ప్రజలు శుభ్రతతో పాటు చుట్టూ పక్కల ప్రదేశాలను మెరుగుగుపర్చుకోవాలని సూచించారు. మలేరియా వ్యాప్తి పట్ల అవగాహన కల్పించిన ఆమె ప్రజలు అప్రమత్తంగా ఉండి అనారోగ్యాల భారిన పడిన వెంటనే ఆసుపత్రికి రావాలన్నారు. తాము తమ సిబ్బంది వైద్య సేవలను అందించేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలిపారు.
Next Story






